హైదరాబాద్‌కు మాజీ సీఎం జగన్.. భారీగా వెలిసిన కటౌట్లు
హైదరాబాద్: వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) శుక్రవారం హైదరాబాద్‌కు రానున్నారు. ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఆయన నగరానికి వస్తుండటంతో అభిమానులు, అనుచరులు భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. జగన్‌కు స్వాగతం పలుకుతూ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు, ఫ్లెక్సీలు, భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు.
ముఖ్యంగా బేగంపేటతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో జగన్‌తో పాటు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్(Former Telangana CM KCR), మాజీ మంత్రి కేటీఆర్ కటౌట్లు కూడా దర్శనమిస్తున్నాయి. జగన్ రాకను స్వాగతిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో వజ్రం ఎక్కడ ఉన్నా మెరుస్తూనే ఉంటుంది అంటూ అభిమానులు ప్రత్యేక కొటేషన్‌ను పొందుపరిచారు. ఈ ఫ్లెక్సీలు, కటౌట్లు ప్రస్తుతం హైదరాబాద్‌లో రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లోని జల్ విహార్‌లో జరిగే వివాహ వేడుకకు జగన్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయనను కలిసేందుకు అభిమానులు, పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






