21 August, 2026 | 1:09 PM

కేసముద్రంలో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో

21-08-2026 12:03 PM

కేసముద్రం (విజయక్రాంతి): పాలిటెక్నిక్ విద్యార్థులకు నష్టం కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో 97 రద్దు చేయాలని, శక్తి కార్యక్రమం ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థులకు తీరని నష్టం వాటిల్లుతుందని, వెంటనే ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా జీవో 97 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో రాస్తారోకో చేపట్టారు. విద్యార్థులకు సంఘీభావంగా బీజేపీ నాయకులు రాస్తారోకో కార్యక్రమంలో పాల్గొన్నారు.