21 August, 2026 | 1:09 PM

హెచ్.సి.యూలో సీటు సాధించిన విద్యార్థినిని సన్మానించిన సర్పంచ్

21-08-2026 11:59 AM

బాన్సువాడ, ఆగస్టు 21 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూర్ గ్రామానికి చెందిన మల్లెల క్యాకప్ప  కుమార్తె శివ సీతన అనే విద్యార్థినిని బీర్కూరు గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ గ్రామ యువకులు శుక్రవారం ఘనంగా సన్మానించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సులో హిస్టరీ భాగంలో 96 % సీటు సాధించిన శివ సీతనకు శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నత స్థాయికీ చేరుకొని ఐఏఎస్ ఆఫీసర్ ఉద్యోగం సాధించాలని సర్పంచ్ ధర్మ తేజ పేర్కొన్నారు. తల్లిదండ్రుల పేరూ, ఊరు పేరును నిలబెట్టాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో కుర్రి కృష్ణ, శివ యాదవ్, యోగి, చామకూర రాజు, బసవరాజ్,అరిగే శ్రీకాంత్,నవీన్ రాజశేఖర్ సార్,రాజు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.