క్షేత్రస్థాయిలోనే భూ సమస్యలకు పరిష్కారం
జిల్లాల వారీగా రెవెన్యూ మంత్రి సమీక్షలు
హైదరాబాద్: తెలంగాణలో నేటి నుంచి జిల్లాల వారీగా రెవెన్యూ శాఖ సమీక్షలు(Revenue Department Reviews) నిర్వహించనుంది. క్షేత్రస్థాయిలోనూ భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాల వారీగా సమీక్షించేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy) ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేశారు. హైదరాబాద్ కేంద్రంగా సమీప జిల్లాలపై సమీక్షలు నిర్వహించనున్నారు. దూరంగా ఉండే జిల్లాలకు మంత్రి పొంగులేటి స్వయంగా వెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తాహసీల్దార్ల కీలక సమీక్షల్లో పాల్గొనున్నారు. సబ్ రిజిస్ట్రార్లతోనూ మంత్రి సమీక్షించనున్నారు. ఇవాళ ఉమ్మడి కరీంనగర్ రేపు, నిజిమాబాద్ జిల్లాల్లో మంత్రి సమావేశం కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22Aపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళన చేస్తోంది.






