25 August, 2026 | 3:39 AM

చిరుతపులి చర్మం అమ్మేందుకు యత్నం

25-08-2026 01:10 AM

నలుగురు వ్యక్తుల అరెస్ట్

భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 24 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిరుతపులి చర్మం , గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు వ్యక్తులను బూర్గంపహాడ్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.విశ్వసనీయ సమాచారం మేరకు, బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ  నాగ బిక్షం, టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం ఉదయం సమయంలో తాళ్లగొమ్మూరు గ్రామం అనిల్ అనే వ్యక్తీ ఇంటి వద్ద, ఒక చిన్న బ్యాగ్‌తో అనుమానాస్పదంగా ఉన్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం, నిందితులు గత సంవత్సరం వేసవి కాలంలో చింతూరు మండలం గమ్మలకోట గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో గుంతలో పడిపోయి బయటకు రాలేని పరిస్థితిలో ఉన్న చిరుతపులిని రాళ్లు, కర్రలుతో కొట్టి ,బాణాలు విసిరి చంపినట్లు తెలిపారు. అనంతరం దాని చర్మం, గోర్లను తొలగించి, చర్మాన్ని ఎండబెట్టి, గోర్లను భద్రపరిచి ఉంచినట్లు వెల్లడించారు. వాటిని తాళ్లగొమ్మూరులోని అనిల్ కుమార్ ఇంటికి తీసుకువచ్చారు.