ప్రతాపసింగారంలో దొంగల ముఠా అరెస్ట్
19-04-2026 12:39 PM
హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతాపసింగారంలో దొంగల ముఠాను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ప్రతాపసింగారంలో నివసిస్తున్న ఈ నిందితులు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో చోరీ చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఘటనా స్థలానికి వెళ్లి ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకొని నిందితుల నుంచి 70 సెల్ ఫోన్లు, భారీగా బంగారం, కారు, బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.






