11 March, 2026 | 8:45 AM

విల్లాహైట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గాండ్ల సంపత్

11-03-2026 12:58 AM

బేగంపేట, మార్చి ౧౦ (విజయక్రాంతి): బేగంపేట బ్రాహ్మణవాడీ విల్లాహైట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గాండ్ల సంప త్ ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గాండ్ల సంపత్‌తోపాటు సెక్రట రీగా వెంకట్, ట్రెజరర్ శరత్చందర్, వైస్ ప్రెసి డెంట్‌గా సుధీర్ భాష్యం, జాయిం ట్ సెక్రటరీగా మృదుల ఎన్నికయ్యారు.

ఈ సంద ర్భంగా నూతన అధ్యక్షుడు గాండ్ల సంపత్ మాట్లాడుతూ.. సొసైటీ అభివృద్ధి, నివాసితుల సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిత్యం అందరికీ అందుబాటులో ఉండి విల్లా హైట్స్ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని చెప్పారు. వరుసగా నాలుగోసారి ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికైన సంపత్‌ను విల్లాహైట్స్ సభ్యులు అభినందించారు.