3 August, 2026 | 9:29 PM

క్రీడా దుస్తులకు ఆర్థిక సాయం అందించిన ఘనగాని రాజు.

03-08-2026 08:26 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో విద్యార్థినులకు క్రీడా దుస్తులను దాత ఘనగాని రాజుతో కలిసి ఎంఈఓ బోయిని లింగయ్య అందజేశారు సోమవారం విద్యార్థుల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు లక్ష్యాలను ఎంచుకొని లక్ష్యసాధన కోసం, నిరంతరం శ్రమించాలని సూచించారు.

విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ,మండలంలోని తూర్పు గూడెం గ్రామానికి చెందిన ఘనగాని రాజు, సుమారు 15 వేల రూపాయల విలువ గల క్రీడా దుస్తులను అందజేయడం అభినందనీయమన్నారు. విద్యార్థులు క్రీడల్లో రాణించి విద్యాలయానికి పేరు ప్రతిష్టలు తేవాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ ఓ వసంత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.