14 May, 2026 | 5:58 PM

సోనాల మండలం కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గాజుల పోతన్న

14-05-2026 04:41 PM

బోథ్. మే 14 (విజయ క్రాంతి): సోనాల మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గా జుల పోతనను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నరేష్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు.. ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి రాజకీయ రంగ ప్రవేశం చేసిన గాజుల పోతన పార్టీ పార్టీస్పృత కోసం తన వంతు పాత్రను పోషిస్తూ వస్తున్నారు. గత సర్పంచ్ ఎన్నికలలో ఆయన సతీమణిని సర్పంచ్ గా బరిలోకి దించడం జరిగింది. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నా ఈయనకు మండల కన్వీనర్ బాధ్యతలను కట్టబెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం తన వంతు కృషి చేస్తానని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామన్నారు