14 May, 2026 | 5:57 PM

బోధన్ ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం

14-05-2026 04:43 PM

బోధన్: (విజయక్రాంతి): సాలూర మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. బోధన్ నుంచి  నాందేడ్ కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు 40 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఆర్టీసీ బస్సు సాలూరా మండల శివారులో ఇండియా పెట్రోల్ బంక్కు చేరుకోగానే రోడ్డు పక్కన ఉన్న చెట్టు ఒక్కసారిగా విరిగి బస్సుపై పడబోయింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి హ్యాండ్ బ్రేక్ వేయడంతో బస్సులోని ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పింది. ఒక్కరికి మాత్రమే గాయాలైనట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.