21 March, 2026 | 10:58 PM

వివిధ అభివృద్ధి పనులకు 70 కోట్లు

21-03-2026 07:35 PM

భైంసా,(విజయక్రాంతి): ముధోల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనులకు 70 కోట్ల నిధులు మంజూరైనట్టు ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కమ్యూనిటీ భవనాల నిర్మాణం, పాఠశాల ప్రహరీ గోడలు ఇతర అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులకు నిధుల మంజూరి ప్రోసిడింగ్ పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కట్టర్ రవి నాయకులు ప్రభాకర్ తదితరులు ఉన్నారు.