21 August, 2026 | 10:30 PM

పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటికి వినతి పత్రం అందజేత

21-08-2026 09:44 PM

కోరుట్ల,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా పర్యటనకు విచ్చేసిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగారావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు సూచన మేరకు  కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత గంగాధర్లు కలిసి పట్టణ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు ఇందుకు సానుకూలంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి స్పందించినట్లు మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత గంగాధర్ తెలిపారు.