కొత్తగూడెంల జీజీహెచ్ త్వరలో క్యాథ్ ల్యాబ్ సేవలు: ఎమ్మెల్యే కూనంనేని
జీజీహెచ్‌కు రూ.3 కోట్ల నిధుల మంజూరు
కొత్తగూడెం,(విజయక్రాంతి): జిల్లా ప్రజలకు మెరుగైన కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు స్థానిక, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన విశేష కృషి, ఎట్టకేలకు ఫలించింది. రూ. 3 కోట్ల నిధులను మంజూరు చేయించి, (జీజీహెచ్)లో అత్యాధునిక సౌకర్యాలు సమకూరనున్నాయి. గుండె సంబంధిత సమస్యలతో బాధపడే రోగుల, ప్రాణాలను కాపాడేందుకు కీలకమైన అధునాతన క్యాథ్ ల్యాబ్ సేవలను,త్వరలోనే ప్రారంభించనున్నారు.
క్రిటికల్ కేర్ యూనిట్ (సీసీయూ)ను, వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం పేదలు, ప్రైవేట్ కేంద్రాలకు వెళ్లి డబ్బు ఖర్చు చేసే రోజులు కు చరమగీతం పాడనుంది. 20 పడకల ఐసీయూ (ఐసీయూ ) విభాగాన్ని కూడా నిర్మిస్తున్నారు. గుండెపోటు లేదా ఇతర తీవ్రమైన అత్యవసర పరిస్థితులు ఏర్పడితే మెరుగైన వైద్యం కోసం,సుదూర ప్రాంతాలైన హైదరాబాద్, ఖమ్మం వంటి నగరాలకు పరుగులు తీయాల్సి వచ్చేది. సకాలంలో వైద్యం అందక మార్గమధ్యలోనే ఎందరో నిస్సహాయ స్థితిలో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనలు అనేకం ఉన్నాయి.
ఇప్పుడు జీజీహెచ్‌లోనే కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ఈ అన్ని రకాల అత్యున్నత వైద్య వసతులు సమకూరనుండటంతో స్థానిక ప్రజలకు ఎంతో మేలు జరగనుంది. ఎమ్మెల్యే కూనంనేని చొరవపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూనంనేని నాయకత్వంపై ప్రజలు, ప్రజాసంఘాలు, కార్మికులు సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సందర్బంగా కూనంనేని మాట్లాడుతూ, ఆధునిక ఐసీయూ సేవల ద్వారా అత్యవసర విభాగంలో, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు,మెరుగైన వైద్య వసతులు కల్పించే దిశగా ఆసుపత్రి,అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు.






