21 August, 2026 | 10:29 PM

భక్తిశ్రద్ధలతో వాసవి అమ్మవారి జీవిత చరిత్ర ప్రవచనాలు

21-08-2026 09:42 PM

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాల వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న ఆర్యవైశ్యుల కులదైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జీవిత చరిత్ర ప్రవచనాలు భక్తిశ్రద్ధల మధ్య రెండో రోజు విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా అమ్మవారి జీవిత చరిత్ర, ఆధ్యాత్మిక విశిష్టత, ధర్మబద్ధమైన జీవన విధానం తదితర అంశాలను ప్రవచనకర్తలు భక్తులకు వివరించారు. ప్రవచన కార్యక్రమానికి ఆర్యవైశ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి జీవిత చరిత్రను ఆసక్తిగా ఆలకించారు. శ్రీ కోదండ రామాలయం ప్రాంగణం భక్తులతో సందడిగా మారగా, వాసవి అమ్మవారి నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రవచన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.