19 June, 2026 | 4:02 PM

పెద్దమ్మ గుడి బోనాలకు పూర్తి వసతులు

19-06-2026 02:40 PM

డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు హామీ

ముకరంపుర,(విజయక్రాంతి):  ముదిరాజుల ఆరాధ్య దైవం పెద్దమ్మతల్లి బోనాల జాతర ఈ సంవత్సరం కూడా జులై 5,  ఆదివారం జరగనుంది. గత తరహాలోనే ఈ ఏడాది కూడా నగరపాలక సంస్థ ద్వారా ఉత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కోరుతూ పట్టణ ముదిరాజ్ సంఘం నాయకులు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్  యాదగిరి సునీల్ రావు కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

ఈ విజ్ఞప్తిపై  యాదగిరి సునీల్ రావు  సానుకూలంగా స్పందించి బోనాల పండుగను ఘనంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు నగరపాలక సంస్థ పక్షాన పూర్తి సహకారం ఉంటుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తుల దాహార్తిని తీర్చేందుకు సురక్షితమైన త్రాగునీటి ఏర్పాటు. జాతర జరిగే రోజుల్లో ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా సౌకర్యాలను తప్పకుండా కల్పిస్తామని హామీ ఇచ్చారు.