8 April, 2026 | 3:48 AM

పరారీలో ఉన్న నిందితుడు అరెస్ట్

08-04-2026 12:00 AM

వివరాలు వెల్లడించిన ఏఎస్‌పి చిత్తరంజన్

కుమ్రం భీం అసిఫాబాద్, ఏప్రిల్ 7(విజయ క్రాంతి): తిర్యాణి మండలం పిట్టగూడ గ్రామానికి చెందిన హన్మంతరావు హత్య కేసులో పరారైన నిందితుడు రాయిసిడం వినోద్ కుమార్ను పోలీసులు మంగళవారం గోలేటి ఎక్స్రోడ్ ఆటో స్టాండ్ వద్ద అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినట్లు  ఏఎస్పీ చిత్తరంజన్ తెలిపారు. రెబ్బెన సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.

హన్మంతరావు మంత్రాలు చేస్తున్నాడ ని అనుమానంతో వినోద్ కుమార్ గొడ్డలితో దాడి చేసి హత్య చేసినట్లు తెలిపారు.  సంఘటన సమయంలో అక్కడే ఉన్న హన్మంతరావు భార్య బోజ్జు బాయిని కూడా హత్య చేస్తానని నిందితుడు బెదిరించడంతో ఆమె అక్కడి నుంచి తప్పించుకున్నట్లు చెప్పారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినప్పటికీ పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో మూత్ర విసర్జనకు వెళ్తానని చెప్పి విధుల్లో ఉన్న పోలీసులను తోసివేసి నిందితుడు పరారైనట్లు తెలిపారు.  జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆదేశాల మేరకు రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టగా మంగళవారం నిందితుడు వినోద్ కుమార్ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పా రు.

అనంతరం విచారణ జరిపి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించనున్నట్లు ఏఎస్పీ చిత్తరంజన్ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో కృషి చేసిన రెబ్బెన సీఐ సంజయ్, ఎస్త్స్ర వెంకటకృష్ణ, తిర్యాణి ఎస్త్స్ర వెంకటేష్, పోలీస్ సిబ్బంది శ్రీనివాస్, విద్యాసాగర్, శ్రీనివాస్, దుర్గేంద్ర, సందీప్లను జిల్లా ఎస్పీ  అభినందించారు.