29 March, 2026 | 4:14 AM

రాజకీయాల్లోకి కొత్తనీరు!

29-03-2026 02:25 AM

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ పునర్ విభజన వల్ల కొత్త త రం నాయకత్వానికి అవకాశం దక్కుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. అనాదిగా దేశ రాజకీయాలను వారసత్వ రాజకీయాలు శాసిస్తున్నాయి. పట్టిపీడిస్తున్నాయి. దేశంలో ఏ చట్టసభల చరిత్ర చూసినా వారసత్వ రాజకీయాలతో నిండిపోయిన పరిస్థితి కనిపి స్తోంది. ఇటీవల బీహార్ లో జరిగిన పరిణామాలు చూస్తుంటే వారసత్వ రాజకీయాలు దేశంలో ఎంత బలంగా వేళ్లు నూనుకుని పోయాయో అర్థం అవుతుంది. దేశంలో అన్ని రాజకీయ పార్టీలు వారసత్వానికే పెద్దపీట వేస్తున్నాయి.

కొన్ని నియోజకవర్గాలు దశాబ్దాలుగా ఒకే కుటుంబం చేతులలో బందీగా మారిపోయిన ఘటనలు కూడా మనకు కనపడుతున్నాయి. కాబట్టి కొత్తగా ఏర్పడుతున్న నియోజకవర్గాలలో పార్టీలు లేదా ప్రజలు కొత్త నాయకత్వాన్ని ఆదరించాలి. ముఖ్యంగా యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రజాస్వామ్యానికి గౌరవం పెరుగుతుంది. ఇటీవల నేపాల్‌లో ఎలాంటి రాజకీయ నేప థ్యం లేదా వారసత్వం లేని వ్యక్తులు అధికారంలోకి వచ్చారు.

జర్నలిజం నుంచి వచ్చిన రవిలామిచన్ లేదా కళా రంగం నుంచి వచ్చి న బాలెన్ షా వంటి వారు రాష్ట్రీయ స్వతం త్ర పార్టీని ఏర్పాటు చేశారు. వారు నేపాల్ లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న తీరు రాజకీయాలలో ఒక కొత్త వరవడిగానే చూడాలి. కొత్త నియోజకవర్గాలు ఏర్పడుతు న్న వేళ కొత్త తరం నాయకత్వానికి అవకాశాలు దక్కితే అది దేశ రాజకీయ వ్యవస్థను మరింత బలంగా మారుస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. గెలుపే పరమావధిగా భావిస్తున్న రాజకీయ పార్టీలు వారసత్వ రాజకీయాలను లేదా కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించకూడదు

భిన్నమైన వాదనలు

భారత రాజ్యాంగంలోని 81వ ఆర్టికల్ ప్రకారం దేశంలో ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు సేకరించాల్సి ఉం టుంది. ఈ జనాభా లెక్కల సేకరణ పూర్తయిన తర్వాత నియోజకవర్గాల పునర్ వ్యవ స్థీకరణ కమిషన్ ఏర్పాటు చేస్తారు. దీనినే డీలిమిటేషన్ ప్రక్రియ అని పిలుస్తారు. ఇప్పటివరకు మన దేశంలో 1952, 1963, 1973 సంవత్సరాల్లో నియోజకవర్గాల పునర్ విభజన జరిగింది. ఆ తర్వాత 2002లో కూడా నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ జరిగింది.

అయితే, ఆ సమయంలో లోక్ సభ స్థానాలు, శాసనసభ నియోజకవర్గాల సం ఖ్యను పెంచలేదు. కేవలం నియోజకవర్గాల సరిహద్దులను మాత్రమే మార్పు చేశారు. 1973లో చేపట్టిన పునర్ వ్యవస్థీకరణ సమయంలో జనాభా ప్రాతిపదికన లోక్ సభ నియోజకవర్గాలను 543 స్థానాలకు పెంచా రు. అదే విధంగా రాష్ట్రాల శాసనసభ నియోజకవర్గాలను 4123 స్థానాలకు పెంచారు.

అయితే గత ఐదు దశాబ్దాలుగా వివిధ కారణాల వల్ల దేశంలో నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియను స్తంభింపజేశారు. దేశంలో విస్ఫోటన స్థాయిలో పెరుగుతున్న జనాభాను నియంత్రించే లక్ష్యంతో 1976లో 42వ రాజ్యాంగ సవరణ చేశారు. దీని ద్వా రా 25 సంవత్సరాల వరకు అంటే 2001 నాటికి నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియను నిలిపివేశారు. మరలా దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో 2001లో 84వ రాజ్యాంగ సవరణ చేశారు. దీని ద్వారా మరొక 25 సంవత్సరాలు అంటే 2026 నాటికి నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణను స్తంభింపజేశారు.

అయితే 2026 నాటికి ఈ స్తంభన గడువు ముగిసిపోతున్న తరుణంలో 2029 సాధారణ ఎన్నికల నాటికి పునర్ వ్యవస్థీకరణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రక్రియతో పాటు చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే మహిళా బిల్లును కూడా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. గతంలో మూడు పర్యాయాలు జనాభా ప్రాతిపదికనే డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టారు. మరొకసారి జనాభా ప్రాతిపదికనే నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియను చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యా యం జరుగుతుందనే వాదన వినిపిస్తోంది.

1976 తర్వాత ప్రభుత్వ లక్ష్యాల మేరకు జనాభా పెరుగుదలను నియంత్రించడంలో దక్షిణాది రాష్ట్రాలు అద్భుత ప్రగతి సాధించాయి. జనాభా ప్రాతిపదికన స్థానాలు పెంచితే జనాభా నియంత్రించని ఉత్తరాది రాష్ట్రాలకే ఎక్కువ సీట్లు దక్కుతాయి. ఈ అభ్యంతరాల నేపథ్యంలో 2011 జనాభా లెక్కల ఆధారంగా లోక్ సభ స్థానాలను లేదా రాష్ట్రాల శాసనసభ స్థానాలను 50 శా తం పెంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలను ముందుకు తెస్తోంది.

ఈ 50 శాతం పెంపు ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్ విభజన చేపడితే ప్రస్తుతం ఉన్న లోక్ సభ స్థానాల సంఖ్య 543 నుంచి 816 స్థానాలకు పెరుగుతుంది. అంటే సుమారు 273 స్థానా లు అదనంగా తోడవుతాయి. అదే విధంగా రాష్ట్రాల శాసనసభ స్థానాల సంఖ్య 4123 నుంచి 6185 స్థానాలకు పెరుగుతుంది. అంటే మొత్తం 2062 అసెంబ్లీ స్థానాలు అదనంగా పెరుగుతాయి.

తెలుగు రాష్ట్రాల్లో..

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో 9 లోక్ సభ స్థానాలు పెరుగుతా యి. అలాగే 60 శాసనసభ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో 13 లోక్ సభ స్థానాలు పెరగవచ్చు. అసెంబ్లీ స్థానాలు 88 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. 

మహిళల ప్రాతినిధ్యం పెంపు

దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలలో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య కేవలం 390 మాత్రమే ఉంది. ఇది కేవలం 9.4 శాతానికి సమానం. కాబట్టి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టం అమలైతే 816 లోక్ సభ స్థానాలలో మహిళలకు 270 స్థానాలు దక్కుతాయి. అలాగే 6185 శాసనసభ స్థానాలలో మహిళలకు 2042 స్థానాలు రిజర్వ్ చేయబడతాయి. దీనివల్ల చట్టసభలలో మహిళల ప్రాతినిధ్యం భారీగా పెరుగుతుంది.

తెలుగు రాష్ట్రాలలో 42 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ నుంచి ఇద్దరు లేదా ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు మహిళలు మాత్రమే లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లోక్ సభ స్థానాల సంఖ్య పెరిగి చట్టం అమలైతే రెండు రాష్ట్రాల నుంచి 22 మంది మహిళలకు లోక్ సభలో ప్రాతినిధ్యం దక్కుతుంది. జనాభా ప్రాతిపదికన మాత్రమే పునర్ వ్యవస్థీకరణ జరిగితే దక్షిణాది రాష్ట్రాలలో లోక్ సభ నియోజకవర్గాల సంఖ్య 130 నుంచి 165 కు మాత్రమే పెరిగేవి. కానీ 50 శాతం పెంపు ప్రతిపాదన వలన దక్షిణాది రాష్ట్రాలలో లోక్ సభ స్థానాల సంఖ్య 196కి పెరిగే అవకాశాలు ఉన్నాయి.

కాబట్టి ఈ నిర్ణయం దక్షిణా ది రాష్ట్రాలకు కొంత ఉపశమనం కలిగించేదే. నియోజకవర్గాలు పెరగటం వలన చట్టసభల బలం పెరుగుతుంది. కొత్త తరానికి అవ కాశాలు కూడా దక్కుతాయి. అలాగే మహి ళా రిజర్వేషన్ బిల్లు కూడా అమలు చేస్తే చట్టసభలలో మహిళల ప్రాతినిధ్యం పెరగడమే కాకుండా దేశంలో రాజకీయ అవినీతి తగ్గే అవకాశాలు ఉంటాయి.

50 శాతం నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనలకు అన్ని రాజకీయ పార్టీలు ఆమోదం తెలపాలి. రా జ్యాంగంలోని ఆర్టికల్ 81, 82 మరియు 170కి సవరణలు చేయాలి. అప్పుడే ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చి నియోజకవ ర్గాల పునర్ వ్యవస్థీకరణ జరుగుతుంది. ఏ డు కోట్ల జనాభా ఉన్న బ్రిటన్‌లో 650 మంది హౌస్ ఆఫ్ కామర్స్ సభ్యులు ఉన్నారు. 

పెరగనున్న బాధ్యత

146 కోట్ల జనాభా గల భారతదేశానికి 816 మంది లోక్ సభ సభ్యులు ఉండటం పార్లమెంటరీ ప్రజాస్వామ్య బాధ్యతను పెం చుతుంది. ఐదు దశాబ్దాలుగా స్తంభించిపోయిన పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియను చేప ట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మా ర్పుల వల్ల క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రజాప్రతినిధులు మరింత చేరువ అవుతారు. పాలనలో పారదర్శకత పెరిగే అవకాశం ఉం టుంది.

రాజకీయాల్లో నిబద్ధత కలిగిన కొత్త నాయకులు రావడానికి ఇది ఒక సువర్ణ అవకాశం. రాజకీయ పార్టీలు తమ పాత పద్ధతు లను మార్చుకుని యువతకు, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. నియోజకవర్గాల పు నర్ విభజన కేవలం సంఖ్యల మార్పు మా త్రమే కాదు. అది ప్రజాస్వామ్య పునర్జీవనానికి ఒక నాంది కావాలి.

          సెల్: 9885465877