1 May, 2026 | 3:34 PM

ఉచిత వేసవి హాకీ శిక్షణా శిబిరం ప్రారంభం

01-05-2026 02:31 PM

చిట్యాల, మే1 (విజయక్రాంతి): చిట్యాల మండల పరిధిలోని ఉరుమడ్ల గ్రామంలో శుక్రవారం ఉచిత వేసవి హాకీ శిక్షణా శిబిరం ప్రారంభమైంది. నల్గొండ జిల్లా యువజన మరియు క్రీడా శాఖ ఆధ్వర్యంలో, శిక్షకుడు గంగాపురం రాము పర్యవేక్షణలో ఈ శిబిరం నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ సాగర్ల భాను శ్రీ బిక్షం, సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ వాడపల్లి రవీందర్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, నిత్యం క్రీడల్లో పాల్గొనడం ద్వారా శరీరంలోని క్యాలరీలు వినియోగించబడుతూ ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని, అలాగే క్రీడలు ఒత్తిడిని తగ్గించి, ఏకాగ్రత మరియు జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

విద్యార్థులు క్రీడలను అలవాటు చేసుకోవడం ద్వారా లక్ష్యసాధనలో పట్టుదల పెరుగుతుందని, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగడానికి దోహదపడుతుందని సూచించారు. అనంతరం క్రీడాకారులకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పొలగోని స్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, జిల్లా కాంగ్రెస్ నాయకుడు పల్లపు బుద్ధుడు, గ్రామ సెక్రటరీ ఉపేందర్, సోషల్ మీడియా ఇంచార్జ్ పట్ల జనార్ధన్, వార్డు సభ్యులు జనపాల శ్రీను, విద్యార్థులు మరియు క్రీడాకారులు తదితరులు  పాల్గొన్నారు.