సాయిప్రియ కాలనీలో ఉచిత వైద్య శిబిరం
మేడిపల్లి మార్చి 3 (విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని పర్వతాపూర్ సాయి ప్రియ కాలనీ రోడ్ నెంబర్ 5లో లీతా చారిటబుల్ ట్రస్ట్, ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లీతా చారిటబుల్ ట్రస్ట్ పెద్దలు డాక్టర్ చిరంజీవి, డాక్టర్ కమల చిరంజీవి, పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆర్‌వి ఫౌండేషన్ చైర్మన్ తుంగతుర్తి రవి పాల్గొన్నారు.
ఈ శిబిరంలో సుమారు 300 మందికి బిపి, షుగర్, రక్త పరీక్షలు, దంత పరీక్షలు, కంటి పరీక్షలు, ఎక్స్రే, ఈసీజీలతో పాటు గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు ప్రత్యేక వైద్య చికిత్సలు ఉచితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ మానవసేవే మాధవసేవగా భావించి లీత చారిటబుల్ ట్రస్ట్, ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.




