చిన్నారులకు నిమ్స్‌లో ఉచిత గుండె శస్త్రచికిత్సలు
13 నుంచి ప్రారంభం
నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్
పంజాగుట్ట, ఆగస్టు 10 (విజయక్రాంతి): గుండె సంబంధిత సమస్యలతో బా ధపడుతున్న చిన్నారులకు హైదరాబాద్లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో పూర్తిగా ఉచితంగా గుండె శస్త్రచికిత్స లు నిర్వహించనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ ప్రొ. రాహుల్ దేవరాజ్ వెల్లడించారు.
నిమ్స్ కార్డి యో థొరాసిక్ సర్జరీ విభాగాధిపతి ప్రొ.అమరేశ్వర్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక శస్త్రచికిత్సలు చేపట్టనున్నారు. 13 నుంచి శస్త్రచికిత్సలు ప్రా రంభం కానున్నాయి. వాక్-ఇన్ విధానంలో చిన్నారులను పరీక్షించి, అవసరమైన వైద్య పరీక్షల అనంతరం శస్త్రచికిత్స అవసరమున్న వారికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం, సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఉచితంగా చికిత్స అందించనున్నారు.
అర్హత ఉన్న చిన్నారుల తల్లిదండ్రులు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య నిమ్స్ పాత బ్లాక్ మొదటి అంతస్తులోని సీటీ సర్జరీ కార్యాలయాన్ని నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు. గతంలో చేయించిన వైద్య పరీక్షల నివేదికలు, సంబంధిత పత్రాలు ఉంటే వెంట తీసుకురావాలని, మరిన్ని వివరాలకు 040-2348-9025 నంబర్ను సంప్ర దించవచ్చని సూచించారు.






