24 April, 2026 | 1:51 AM

ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఉచిత దంత వైద్య శిబిరం

24-04-2026 12:18 AM

మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీదేవి రమేష్ నాయక్

మేడ్చల్ అర్బన్ ఏప్రిల్ 23(విజయక్రాంతి):ఎల్లంపేట్ మున్సిపల్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ప్రజలకు అడ్వాంట సీడ్స్ మల్లారెడ్డి ఆసుపత్రి యాజమాన్యం సహకారంతో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీదేవి రమేష్ నాయక్ పేర్కొన్నారు.గురువారం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని,విద్యార్థులకు,పట్టణ ప్రజలకు స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ లు వాచ్ పల్లి అర్చన శ్రీనివాస్ ముదిరాజ్.నీరుగంటి శ్రీలత రమేష్ యాదవ్ ల ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీదేవి రమేష్ నాయక్ మాట్లాడుతూ ఎల్లంపేట్ మున్సిపల్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని,విద్యార్థులకు,పట్టణ ప్రజలకు ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన మల్లారెడ్డి వైద్య కళాశాల యాజమాన్యానికి,అడ్వాంట సీడ్స్ కంపెనీ యాజమాన్యానికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ లు సద్ది సురేష్ రెడ్డి.చిన్నోళ్ల భాస్కర్.మాజీ వార్డు సభ్యులు నీరుగంటి రమేష్ యాదవ్.అడ్వాంటే సీడ్స్ కంపెనీ ప్రతినిధులు.మల్లారెడ్డి కళాశాల వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.