4 July, 2026 | 10:55 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

దొంగతనం కేసులో నలుగురి అరెస్టు

20-03-2026 01:22 AM

సీఐ నిరంజన్ రెడ్డి 

కరీంనగర్ క్రైం, మార్చి19(విజయక్రాంతి): నగునూరు గ్రామంలో ఉన్న సిల్వర్ స్ప్రింగ్ విల్లాస్ లోని ఒక స్టోర్ రూమ్ లో ఉన్న కరెంటు కు సంబంధించిన సుమారు 60 వేల రూపాయల విలువగల కరెంటు వైర్ బండల్స్ ను దొంగిలించారు.

యజమాని పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి దొంగిలించుకుని పారిపోయిన వ్యక్తుల గురించి వెతుకుచుండగ గురువారం తీగలగుట్టపల్లి నుండి ఆరేపల్లికి పోవు దారిలో ఎల్లమ్మ గుడి దగ్గరలో నలుగురు వ్యక్తులు కనబడగా వారు పోలీసు లను చూసి పారిపోవుటకు ప్రయత్నం చేయగా వారిని పట్టుకొని విచారించగా నగునూరులో జరిగిన దొంగతనం గురించి ఒప్పుకున్నారు.

నేరం చేసిన నేరస్తులైన  బొంత కుమార్, అలకుంట్ల జంపయ్య అలియాస్ జంపరాజు, సూర శివాజీ మరియు సూర నవీన్ లను అదుపులోనికి తీసుకొని పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చి వారిపై అరెస్టు మెమో జారీ చేశారు.