2 September, 2026 | 5:32 PM

నగరంలోని ప్రతి కాలనీలో యూజీడీ పూర్తి చేస్తాం

02-09-2026 | 04:45pm

రూ 9.32 కోట్లతో పద్మావతి కాలనీలో పనులకు శంకుస్థాపన

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్‌నగర్,(విజయక్రాంతి): రాబోయే మూడు ఏళ్లలో మహబూబ్‌నగర్ నగరంలోని ప్రతి కాలనీలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) నిర్మాణం పూర్తి చేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 22వ డివిజన్ పద్మావతి కాలనీలో రూ.9.32 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న యూజీడీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 

ఈ కార్యక్రమంలో మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇన్‌చార్జి గోనెల శ్రీనివాసులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, అజ్మత్ అలీ, 22వ డివిజన్ కార్పొరేటర్ ఎం. జ్యోతి, ఇతర కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.