12 August, 2026 | 7:58 PM

కోర్టు భవనానికి త్వరలోనే శంకుస్థాపన చేయిస్తా

12-08-2026 06:01 PM

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు

తుంగతుర్తి,(విజయ క్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో సివిల్ కోర్టు రూ.29 కోట్లతో సాంక్షన్ అయినదున, తుంగతుర్తి  నేషనల్ 365 హైవే రోడ్డు పక్కన స్థలం పరిశీలన చేసి, అతి త్వరలో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయిస్తానని, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు అన్నారు. దీనితో పరిశీలకొచ్చిన కోటు సిబ్బంది, న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.

అనంతరం తుంగతుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ మండల అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నపర్తి జ్ఞాన సుందర్, మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, పిఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు, మండల పార్టీ అధ్యక్షులు రేగటి రవి గౌడ్, పచ్చిపాల వెంకన్న, డిప్లనాయక్, పానుగంటి లక్ష్మీనరసింహారెడ్డి, నాగరాజు, తదితర నాయకులు పాల్గొన్నారు.