న్యాయవాది కుటుంబాన్ని పరామర్శించిన మాజీ జెడ్పీ చైర్మన్ లింగాల కమల రాజు
ఎర్రుపాలెం,(విజయ క్రాంతి): మండల కేంద్రనికి చెందిన న్యాయవాది గంధం శ్రీనివాసరావు కుటుంబాన్ని బుధవారం నాడు జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల రాజు పరామర్శించారు. గంధం శ్రీనివాస రావు మాతృమూర్తి శకుంతల అనారోగ్యం తో మృతి చెందింది. మధిర కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న గంధం శ్రీనివాసరావు, కుటుంబ సభ్యులను జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, బీఆర్ఎస్ నాయకులు యన్నం శ్రీనివాస రెడ్డి, సేగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, గూడూరు రమణారెడ్డి, సంక్రాతి కృష్ణరావు, షేక్ మస్తాన్ వలి, శీలం కృష్ణారెడ్డి, షేక్ బహుదూర్,గద్దల శ్రీనివాస రావు,బాలాజీ, సత్యనారాయణ రెడ్డి తదితరులు పరామర్శించారు. బనిగండ్లపాడులో మాజీ సర్పంచ్ జంగా పుల్లారెడ్డి ని,భీమవరం, గుంటుపల్లి గోపవరం తదితర గ్రామాల్లో పర్యటించి. పలువురి కుటుంబాలను పరామర్శించారు.






