15-02-2026 03:32:10 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని తాండూరు గ్రామంలోని గల మంజీరా నది ఒడ్డున వెలసిన త్రిలింగ రామేశ్వరాలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం వేకువజామున నెమరిన ఆధ్యాత్మిక వాతావరణంలో నిండిపోయింది. మహాశివరాత్రి సందర్బంగా మాజీ జెడ్పిటిసి ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అభిషేకంతో శివుడికి చేశారు.
అలయంలోని ప్రతీ మూలలోనూ శివభక్తుల ప్రార్థనలు,మంత్రోచ్ఛారణలతో గంభీరమైన ధ్వనులు వినిపించాయి. మాజీ జడ్పీటీసీ ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి పూజల్లో భక్తులతో భక్తిపరమైన ఆలోచనలు పంచుకున్నారు. శివుని మహిమను వివరించారు. పూజల అనంతరం భక్తులు శాంతి, ఆనందంతో తిరిగి వారి గృహాల వైపు వెళ్లారు. ప్రతి భక్తికి ఈమహా శివరాత్రి ఒక పవిత్రమైన అనుభూతిగా మారింది. ఆలయం నుండి వెలువడిన శాంతి, శివభక్తి ధారలు గ్రామాన్ని ఆధ్యాత్మిక ఉల్లాసంతో నింపాయి.
శివరాత్రి పర్వదినాన త్రిలింగ రామేశ్వర ఆలయంలో రోజులపాటు అంగరంగ వైభవంగా జాతర మహోత్సవం నిర్వహిస్తారు. మొదటి రోజు ఎడ్ల బండి ప్రదర్శన, బోనాలు రథోత్సవం కార్యక్రమం ఘనంగా జరుపుకుంటారు. ఆలయం చుట్టుప్రక్కల గ్రామాలైనటువంటి మాటూర్, మాసంపల్లి, వెంకంపల్లి, అక్కంపల్లి, లింగంపల్లి, గోపాల్పేట్, నాగిరెడ్డిపేట, ఆత్మకూర్, జలాల్పూర్, పాపన్నపేట మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి శివునికి ప్రత్యేక పూజలు చేసి జాతరను తిలకిస్తారు.