calender_icon.png 6 February, 2026 | 8:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పటేల్ ప్రవీణ్ కుమార్ సేవలు మరువలేనివి

06-02-2026 05:17:57 PM

ఘన నివాళి అర్పించిన మాజీ ఎమ్మెల్యే పైలట్

తాండూరు,(విజయక్రాంతి): స్వర్గీయ పటేల్ ప్రవీణ్ కుమార్ మృతి పార్టీకి , మరియు వ్యక్తిగతంగా తనకు తీరనిలోటని వికారాబాద్ జిల్లా తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. పెద్దముల్ మండలం ఇందూర్ గ్రామ మాజీ ఎంపీటీసీ, శ్రీ వీర శైవ సమాజం యువజన  విభాగం మాజీ అధ్యక్షులు పటేల్ ప్రవీణ్ కుమార్ శుక్రవారం సంతాప సభ ను పట్టణంలోని శ్రీ భద్రేశ్వర స్వామి ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన సంతాప సభలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు, ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవ చేస్తూ పేదల అభిమానాన్ని చూరగొన్న పటేల్ ప్రవీణ్ కుమార్ సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని,  ఒక ధైర్యవంతుడైన నాయకుడిని కోల్పోయామని అన్నారు. ఆయన కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని కల్పించాలని కోరారు. అనంతరం భారీగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు .ఇంకా ఈ కార్యక్రమంలో  బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మిత్రులు, వీర శైవ సమాజం సభ్యులు, యువకులు భారీగా పాల్గొన్నారు