7 August, 2026 | 6:08 PM

కోనేరు నిత్య అన్నదాన సత్రం సందర్శించిన మాజీ ఎమ్మెల్యే

07-08-2026 03:29 PM

ఆసిఫాబాద్(విజయక్రాంతి): కాగజ్‌నగర్ బస్టాండ్ ఎదురుగా గత ఏడు సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతున్న కోనేరు నిత్య అన్నదాన సత్రాన్ని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప శుక్రవారం సందర్శించారు.ఈ సందర్భంగా సత్రంలో భోజనం చేస్తున్న ప్రజలతో నేరుగా మాట్లాడిన ఆయన, అందిస్తున్న ఆహారం రుచి, నాణ్యత, నిర్వహణపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కోనేరు కోనప్ప మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, వారికి సేవ చేయడం తన బాధ్యతగా భావిస్తున్నానన్నారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కన్నా గొప్ప సేవ మరొకటి లేదని పేర్కొన్నారు. నిత్య అన్నదాన సత్రం ద్వారా నిరంతరం ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం తనకు ఎంతో సంతృప్తినిస్తోందని తెలిపారు.గత ఏడు సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగుతున్న ఈ నిత్య అన్నదాన సత్రం ద్వారా ప్రతిరోజూ పలువురు నిరుపేదలు, ప్రయాణికులు, అవసరమైన వారికి ఉచిత భోజనం అందిస్తున్నట్లు తెలిపారు.