27 April, 2026 | 5:41 AM

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ

27-04-2026 02:24 AM

కందాళ ఉపేందర్ రెడ్డి ఘనంగా సత్కరించిన స్వామి ఆలయ కమిటీ

(కూసుమంచి, విజయక్రాంతి) : కూసుమంచి మండలం, లింగారం తండా గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామి, బొడ్రాయి, గరుడ స్తంభ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి  ఆదివారం హాజరై ఆలయంలో పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ మరియు గ్రామ యువజన నాయకులు వాడిత్య బాలకృష్ణ  వారిని ఘనంగా సత్కరించింది శాలువా కప్పి సన్మానించారు. ఆలయ నిర్మాణానికి,  అన్నదాన కార్యక్రమాలకు వారు అందించిన ఆర్థిక సహకారం అభినందనీయం కమిటీ కొనియాడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరిని చల్లగా చూడాలని, అందరు బాగుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోతు పుష్ప రవి, గ్రామస్థులు బాలకృష్ణ, వెంకటేష్, రామూర్తి తదితరులు పాల్గొన్నారు.