హామీలు నెరవేర్చిన ఎమ్మెల్యేకు ఘన సన్మానం
అశ్వాపురం, ఏప్రిల్ 26, (విజయక్రాంతి): పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్న నాయకుడిగా మరోసారి నిలిచారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి ఇచ్చిన హామీల మేరకు గుట్ట మల్లారం గ్రామపంచాయతీ పరిధిలో కళ్యాణ మండప నిర్మాణాన్ని పూర్తి చేసి అందజేయడం పట్ల మున్నూరు కాపు సంఘ నాయకులు ఆయనకు ఆదివారం కృతజ్ఞతలు తెలిపారు.
మణుగూరు ప్రజాభవన్లో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన సంఘ ప్రతినిధులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు వన్నం కృష్ణమోహన్, కార్యదర్శి గాండ్ల సురేష్ మాట్లాడుతూఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఎమ్మెల్యే చూపిన నిబద్ధత ప్రశంసనీయమని అన్నారు. మున్నూరు కాపు సంఘానికి కళ్యాణ మండపం నిర్మాణంతో పాటు, సామాజిక వర్గానికి తగిన రాజకీయ అవకాశాలు కల్పించడం ద్వారా బీసీల పక్షపాతిగా నిలిచారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు గువ్వా రాంబాబు, గోపిశెట్టి శివయ్య, మర్రి సారంగపాణి, ఊట్కూరు సత్యనారాయణ, బేతంచర్ల వెంకటేశ్వర్లు, గాజుల పూర్ణచంద్రరావు, పోట్ల ముత్తయ్య, మీసాల దుర్గారావు, మేడ నాగేశ్వరరావు, మాదాసు సాయిబాబా, బత్తిని రామచందర్, గాండ్ల మల్లయ్య, బడే రామ్మోహన్, తూపూడి శ్రీనివాస్, మిరియాల భాస్కర్, శ్రీకాంత్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. యువజన నాయకులు అడబాల ప్రవీణ్, అమూల్ శ్రీనివాస్, సీనియర్ పత్రికా విలేకరులు పూజారి చందు, సత్యంబాబు, కార్మిక సంఘ నాయకులు ఆకుల నాగరాజు, రామకృష్ణలు కూడా హాజరయ్యారు.






