22 June, 2026 | 2:40 AM

రోడ్డుపై బురదలో బీఆర్‌ఎస్ నేతలు

22-06-2026 01:10 AM

మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే వినూత్న నిరసన 

కామారెడ్డి, జూన్ 21 (విజయక్రాంతి): సంవత్సరాలు గడుస్తున్న పనులు జరగడం లేదంటూ ఆదివారం బాన్సువాడ బిచ్కుంద రహదారిపై జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే ఆధ్వర్యంలో రోడ్డుపై నిలిచిన బురద నీటిలో కూర్చొని బీఆర్‌ఎస్ నేతలు నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బిచ్కుంద అభివృద్ధి కుంటుపడుతుందని ఆరోపించారు. అభివృద్ధి పనులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గత మూడు సంవత్సరాల క్రితం సెంట్రల్ లైటింగ్ రోడ్డు వెడల్పు పనుల కో సం 12 కోట్లు మంజూరయ్యాయని తెలిపా రు. ప్రభుత్వం నుంచి నిధులు తేవడంలో స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. సెంట్రల్ లైటింగ్, రోడ్డు వెడల్పు పనులుపూర్తి చేయకుంటే ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామన్నారు.