22 June, 2026 | 3:00 AM

హస్తినకు సీఎం రేవంత్‌రెడ్డి పయనం

22-06-2026 01:08 AM
  1. రెండు రోజులు ఢిల్లీలోనే మకాం
  2. కేంద్ర మంత్రుల, పార్టీ పెద్దలతో భేటీ కానున్న సీఎం

హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి) : సీఎం రేవంత్‌రెడ్డి హస్తినకు వెళ్లారు. శనివా రం ముంబైకి వెళ్లిన ఆయన, అక్కడి నుంచే ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజులు అక్కడే ఉండి కేంద్ర మంత్రులను కలువనున్నారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ, తమ్మిడిహట్టి ప్రాజెక్టుతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై   చర్చించనున్నారు. గాంధీసరోవర్‌కు అనుమతి ఇచ్చినందున.. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియ జేస్తారు. కాంగ్రెస్ పెద్దల తోనూ సమావేశమై రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను వివరించనున్నారు.