24 April, 2026 | 8:14 PM

ఆర్టీసీ కార్మికుల సమస్యలను బేషరతుగా వెంటనే పరిష్కరించాలి

24-04-2026 06:38 PM

- మాజీ మంత్రి వనమా డిమాండ్

కొత్తగూడెం,(విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని బిఆర్ఎస్ కొత్తగూడ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతునిచ్చి నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళనను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. శుక్రవారం కొత్తగూడెం ఆర్టిసి డిపో వద్ద కార్మికుల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

కార్మికుల సమ్మెకు మద్దతుగా తెలంగాణలో 60 లక్షల మంది గులాబీ శ్రేణులు ఆందోళనకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆత్మహత్య చేసుకున్న శంకర్ గౌడ్ ది ప్రభుత్వ హత్య గా ఆయన అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి,మాజీ రైతు సమన్వయ అధ్యక్షులు కిలారు నాగేశ్వరరావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్, బిఆర్ఎస్ పార్టీ లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్, పాల్వంచ మండల అధ్యక్షులు కొట్టు వెంకటేశ్వరరావు, లావుడ్య సత్యనారాయణ, ముత్యాల రాజేష్, మల్లెల శ్రీరామ్ మూర్తి , మున్సిపల్ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.