16 March, 2026 | 4:58 PM

సీఎం రేవంత్ మూడు సీజన్లు రైతు భరోసా ఎగ్గొట్టారు

16-03-2026 09:48 AM

ప్రశ్నించే ప్రజలను అధికారులు అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం

 మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 

వనపర్తి,(విజయక్రాంతి):  మున్సిపాలిటీ ఎన్నికల ముందు రూ 9వేల కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నాయని ఎన్నికల తరువాత వేస్తామని చెప్పి గత మూడు సీజన్లు రైతు భరోసాను సి ఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఎగ్గొట్టారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Singireddy Niranjan Reddy ) అన్నారు. ఆదివారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు ప్రశ్నించే ప్రజల పక్షాన నిలబడాలికానీ రాజకీయ నాయకుల కొమ్ముకాయకూడదని ఆయన హితువు పలికారు.

సంక్షేమ పథకాలు అమలు కానప్పుడు ప్రజలు తిరగబడుతారు ఆది వారి హక్కు అని ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు.  చిన్నంబావి మండలంలో జరిగిన శ్రీధర్ రెడ్డి హత్యకేసు తేల్చకపోవడం ప్రభుత్వ అసమర్థత అని రెండున్నర ఏండ్లు గడిచిన ఇప్పటికీ శ్రీధర్ రెడ్డి హత్య కేసు తేల్చకుండా  అధికార పార్టీకి తొత్తులుగా మారడం సహించరానిదని వారం రోజుల్లో శ్రీధర్ రెడ్డి హత్యకేసు తెలచకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంచేపడతామని పోలీస్ అధికారులను ఆయన హెచ్చరించారు.

సాగునీటి ప్రాజెక్టుల సాధనలో ప్రభుత్వం విఫలం అయ్యారని రామన్న గట్టు రిజర్వాయర్ శంకుస్థాపన చేసి మొదలు పెట్టిన ఆ ప్రాజెక్టును పట్టించుకోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమని డి 5,డి 8 కాలువలు ఆధునీకరించడం ద్వారా  సాగు నీళ్లు పెంచే అవకాశం ఉన్న సాగునీటి మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు.  7టి.ఎం.సి ల సామర్థ్యం ఉన్న ఎదుల రిజర్వాయర్ రెండేండ్లలో పూర్తి చేశామని నేటి మంత్రులు 2టి.ఎం.సి ల సామర్థ్యం ఉన్న రామన్న గట్టు రిజర్వాయర్ పూర్తి చేయలేకపోవడం మంత్రుల అసమర్థత అని ఆయన మండిపడ్డారు. ఈ సమావేశములో గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్,నందిమల్ల అశోక్, లక్ష్మా రెడ్డి, ఎద్దుల కరుణశ్రీ, కృష్ణా నాయక్,రఘుపతి రెడ్డి,భీమన్న,కర్రెస్వామి,తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.