మాజీ జడ్పీటీసీ జగన్ మోహన్ రావు సోదరి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు
16-03-2026 09:51 AM
ముత్తారం, మార్చి16 (విజయ క్రాంతి): ముత్తారం మండల మాజీ జడ్పీటీసీ నాగినేని జగన్మోహన్ రావు సోదరి చెన్నమనేని జయశ్రీ ఇటీవల గుండె పోటు తో హన్మకొండలో మృతి చెందగా, ఆదివారం రాత్రి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు(Minister Sridhar Baba) హన్మకొండ లోని వారి ఇంటిలో ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతురాలి చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మృతికి గల కారణాలు ఆమె కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట మాజీ జడ్పీటీసీ నాగినెని జగన్ మోహన్ రావు తో పాటు జయశ్రీ కుటుంబ సభ్యులు ఉన్నారు.




