23 May, 2026 | 2:19 AM

కౌన్సిలర్ భర్తపై మాజీ కౌన్సిలర్ భర్త దాడి

23-05-2026 12:05 AM

గద్వాల, టౌన్ మే 22: గద్వాల పట్టణంలోని 36వ వార్డులో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది.ప్రస్తుత కౌన్సిలర్ కమ్మరి సునీత భర్త కమ్మరి రాముపై అదే వార్డు మాజీ కౌన్సిలర్ రజక జయశ్రీ భర్త రజక నర్సింహులు దాడి చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది.స్థానికుల వివరాల ప్రకారం శుక్రవారం 36వ వార్డులో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి అనంతరం నర్సింహులు రాముపై చేయి చేసుకున్నట్లు సమాచారం.

ఈ ఘటనపై బీఆర్‌ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని,ఓటమిని జీర్ణించుకోలేక కొందరు వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని ఆరోపించారు.కమ్మరి సునీత గెలిచినప్పటి నుంచి ఆమె కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని వివిధ రకాల ప్రచారాలు ఇబ్బందులు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు.ఇక 36వ వార్డులో తరచూ వివాదాలు చోటుచేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది.రాజకీయ విభేదాలు వ్యక్తిగత దాడుల వరకు వెళ్లడం ఆందోళన కలిగిస్తోందని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.