ఫిజీషియన్ డాక్టర్ల కార్యవర్గం ఏర్పాటు
20-06-2026 04:27 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఫిజీషియన్ డాక్టర్ల (ఏపీఐటీఎస్) నూతన కార్యవర్గాన్ని శనివారం ఆ సంఘ భవనంలో శనివారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా డాక్టర్ ముఖేష్, జనరల్ సెక్రెటరీగా డాక్టర్ చింతపండు రవికుమార్, కోశాధికారిగా డాక్టర్ మహేష్ బాబు, వైస్ చైర్మన్ లుగా డాక్టర్ సుమల, డాక్టర్ రణీత్, జాయింట్ సెక్రటరీలుగా డాక్టర్ శ్రీకర్, దయాకర్, ఈసీ మెంబర్లుగా డాక్టర్లు మహేష్, ప్రశాంత్, అఖిలారెడ్డి, జవహర్, శృతి రెడ్డి ,బి. రవి లను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలకు అధికారిగా సీనియర్ డాక్టర్ దామెరరాములు వ్యవహరించారు. కొత్తగా ఎన్నికైన కార్యవర్గానికి సన్మానం చేశారు.






