20 June, 2026 | 5:47 PM

మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతిజ్ఞ

20-06-2026 04:25 PM

ఇల్లందు,(విజయక్రాంతి): శాఖా గ్రంథాలయం ఇల్లందు ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శనివారం ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లైబ్రేరియన్ డి. రుక్మిణి మాట్లాడుతూ యువత దేశ భవిష్యత్తుకు మూలస్తంభాలని, మాదకద్రవ్యాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. అనంతరం మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతిజ్ఞ చేయించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.