తల్లిదయ ప్రజలపైన ఉండాలి
మూడు రోజులుగా ఏడుపాయల వన దుర్గ మాత దేవి వరకు పాదయాత్రలో 19వ వార్డు కౌన్సిలర్ నవీన్ రెడ్డి
పటాన్ చెరు: సంగారెడ్డి పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పాశమైలారం 19, 20 వార్డులలో బిఆర్ఎస్ పార్టీ గెలిచినందున బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడులు చంద్రశేఖర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాశమైలారం నుండి ఏడుపాయల వనదుర్గమాత దేవి వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథులుగా నవీన్ రెడ్డి హాజరయ్యారు.
పాదయాత్ర నిర్వహించిన ముగింపు రోజు విందు భోజనం నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్ రెడ్డి మాట్లాడుతూ... ఆ తల్లి కృప 19 20 వార్డు ప్రజల మీద ఎల్లవేళలా, ఆయురారోగ్యాలతో కూడిన జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానురు.ఈ రాజ ముదిరాజ్, అనిల్ యాదవ్, వెంకటేష్, లక్ష్మారెడ్డి నరసింహ, చారి, కిరణ్, శివకుమార్, రాజు, అనిల్ ముదిరాజ్, పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్థులు పాల్గొన్నారు.




