19-02-2026 12:26:07 AM
ఎర్రుపాలెం ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): చిన్న తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్టోర్ రూములను ఖమ్మం ఫుడ్ సేఫ్టీ అధికారి లోకేష్ కుమార్ బుధవారం సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు. ఆలయంలోని లడ్డు తయారు చేసే వంటశాలను,లడ్డు తయారు చేసే విధానాన్ని పరిశీలన చేశారు.
అన్నదాన సత్రంను పరిశీలించి భక్తులకు తయారు చేసిన భోజనశాలలోని వంటకాలను పరిశీలించారు.స్టోర్ రూమ్ లోని లడ్డు తయారీకి, అన్నదానానికి ఉపయోగించే పదార్థాల నిల్వలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ వారి సెలక్షన్లో భాగంగా జమలాపురం ఆలయాన్ని తనిఖీ చేసినట్లు తెలిపారు.ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అధర్టి ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎస్ ఎస్ ఏ ఐ) ద్వారా ఆలయాల్లో తయారు చేసే వస్తువుల నాణ్యతను తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో ఈ అథారిటీ యాదగిరిగుట్ట తర్వాత జమలాపురం వెంకటేశ్వర స్వామివారి దేవాలయాన్ని సెలక్షన్ చేశారని తెలిపారు.అందులో భాగంగానే బుధవారం జమలాపురంలో ఫ్రీఆడిట్ ఇన్వెస్టిగేషన్ చేసినట్లు తెలిపారు.ఆలయంలో లడ్డూ తయారీకి, అన్నదానానికి వాడే పదార్థాల నమూనాలను సేకరించి ఆ నమూనాలను నాణ్యత ప్రమాణాల నిమిత్తం ఫుడ్ లాబరేటరీ కి పంపి నాణ్యత పై పరిశీలన మొదటి స్టేజీలో చేయనున్నట్లు తెలిపారు. ఈ వస్తు నాణ్యత పరిశీలన నాలుగు స్టేజిలో ఉంటుందని,మొదటి స్టేజి పరిశీలన అనంతరం రెండో స్టేజి స్టేటస్ చేస్తామని తెలిపారు. చైర్మన్ ఉప్పల విజయ దేవశర్మ, సీనియర్ అసిస్టెంట్ సోమయ్య,జూనియర్ అసిస్టెంట్ కృష్ణ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.