సుస్థిర కిడ్నీ సంరక్షణ, ముందస్తు గుర్తింపుపై దృష్టి
ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా గ్లెనీగల్స్ ఆసుపత్రి కార్యక్రమాలు
హైదరాబాద్, మార్చి 13(విజయక్రాంతి): ప్రపంచ కిడ్నీ దినోత్సవం 2026 సందర్భం గా గ్లెనీగల్స్ ఆసుపత్రి కిడ్నీ ఆరోగ్యంపై అవగాహన పెంపు, ముందస్తు గుర్తింపు, అలాగే సుస్థిర వైద్య సేవలను ప్రోత్సహించేందుకు తన కట్టుబాటును పునరుద్ఘాటించింది. ఈ ఏడాది ప్రపంచ కిడ్నీ దినోత్సవ థీమ్ అందరికీ కిడ్నీ ఆరోగ్యం.. ప్రజలను సంరక్షిస్తూ, భూమిని కాపాడుదాం అని ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు.
పర్యావరణ పరిరక్షణ, కిడ్నీ ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఈ థీమ్ స్పష్టంగా తెలియజేస్తుందని వారు పేర్కొన్నారు. ఆసుపత్రిలోని నెఫ్రాలజీ విభాగాన్ని డాక్టర్ కేఎస్ నాయక్, డాక్టర్ చైతన్య వర్మ, డాక్టర్ రవి కుమార్ నేతృత్వం వహి స్తూ ఆధునిక కిడ్నీ చికిత్స, ట్రాన్స్‌ప్లాంటేషన్, డయాలసిస్ సేవల్లో విశిష్ట సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ కేఎస్ నాయక్ మా ట్లాడుతూ ప్రపంచ కిడ్నీ దినోత్సవం ఇప్పు డు కేవలం అవగాహన కార్యక్రమంగా కా కుండా ముందస్తు గుర్తింపు, అందరికీ సమా న వైద్య సేవలు, అలాగే పర్యావరణానికి హాని తగ్గించే విధంగా చికిత్సా విధానాలను అభివృద్ధి చేసే ప్రపంచ ఉద్యమంగా మారిందన్నారు.
తమ ఆసుపత్రిలో క్లిష్టమైన ట్రాన్స్ ప్లాంట్ శస్త్రచికిత్సలతో పాటు డయాలసిస్ సేవలు, రోగుల అవగాహన, నివారణ చర్యలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. కాగా ప్రపంచ కిడ్నీ దినోత్సవం కార్యక్రమం 20 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రత్యేక గుర్తింపు. లక్డీకాపూల్లోని గ్లెనీ గల్స్ ఆసుపత్రి కిడ్నీ సంరక్షణలో విశిష్ట కేం ద్రంగా నిలుస్తోంది. ఆధునిక వైద్య విధానా ల ద్వారా వేలాది మంది తక్షణ, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి రోగులకు చికిత్స అందిస్తోంది. ఇప్పటివరకు మూ డు వేలకు పైగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించింది.డయాబెటిస్, అధిక ప్రమా దం ఉన్న రోగుల్లో కూడా 60 శాతం కంటే ఎక్కువ ట్రాన్స్‌ప్లాంట్లు చేశారు.
స్వాప్ కిడ్నీ మార్పిడి, అసంగత కిడ్నీ మార్పిడిలో ముం దంజలో ఉంది. గ్లెనీగల్స్ ఆసుపత్రి భారతదేశంలోనే తొలి కిడ్నీహృదయ సంయుక్త మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించడమే కాకుం డా, ఆంధ్రప్రదేశ్‌లో తొలి మృతదాత కిడ్నీ మార్పిడిను విజయవంతంగా నిర్వహించిన సంస్థగా గుర్తింపు పొందింది. ఆసుపత్రి చెన్నైహైదరాబాద్ క్లస్టర్ సీఈఓ భరత్ కాంత్ రెడ్డి మాట్లాడుతూ, కిడ్నీ సంరక్షణలో ఆధునిక ఐసీయూ, ట్రాన్స్‌ప్లాంట్ థియేటర్లు మాత్ర మే కాకుండా డయాలసిస్ కార్యక్రమాల్లో నీరు, విద్యుత్ వంటి వనరులను బాధ్యతాయుతంగా వినియోగించడం కూడా ఎంతో ముఖ్యమన్నారు. రోగులకే కాకుండా పర్యావరణాన్ని కాపాడే విధంగా వైద్య సేవలు అందించేందుకు తమ బృందాలు కృషి చేస్తున్నాయని చెప్పారు.




