14 March, 2026 | 1:07 AM

తెలంగాణ బీజేపీ ట్రేడ్ సెల్ సహ-కన్వీనర్‌గా అవినాష్ దేవ్డా

14-03-2026 12:00 AM

హైదరాబాద్, మార్చి 13 (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు అవినాష్ దేవ్డాను తెలం గాణ బీజేపీ స్టేట్ ట్రేడ్ సెల్ సహ-కన్వీనర్‌గా నియమిస్తూ బీజేపీ రాష్ట్ర సెక్రెటరీ ఎం గౌత మ్ రావు నియమా ఉత్తర్వులను జారీ చేశారు. ఈ సందర్భంగా అవినాష్ దేవ్డా మాట్లాడుతూ బీజేపీ ట్రేడ్ సెల్ రాష్ట్రంలోని వ్యాపా రులు, చిన్న వ్యాపారదారులు, మార్కెట్ సంఘాలతో మరింత బలమైన అనుసంధానం ఏర్పరుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

వ్యాపార వర్గాల సమస్యలను సమర్థవంతంగా పార్టీ దృష్టికి తీసు కువెళ్లడంతో, వాణిజ్య అభివృద్ధికి తోడ్పడే కార్యక్రమా లను ముందుకు తీసుకెళ్లడంలో తన వంతు కీలక పాత్ర పోషిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భం గా పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన అవినాష్ దేవ్డా, తెలంగాణ వ్యాప్తంగా ట్రేడింగ్ కమ్యూనిటీ సేవకు , పార్టీ బలోపేతానికి పూర్తి నిబద్ధతతో పనిచేస్తానని తెలిపారు.