8 April, 2026 | 11:25 PM

చలివేంద్రాలు ప్రజల దాహార్తిని తీర్చుటకు ఎంతో ఉపయోగపడతాయి

08-04-2026 09:26 PM

మజ్జిగ పంపిణీతో చలివేంద్రం ప్రారంభం

ఘట్ కేసర్,(విజయక్రాంతి): చలివేంద్రాలు ప్రజల దాహార్తిని తీర్చుటకు ఎంతో ఉపయోగపడతాయని బిజెపి ఘట్ కేసర్ డివిజన్ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి అన్నారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజల దాహార్తిని తీర్చే లక్ష్యంతో వైఎస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో అవుషాపూర్ బస్ స్టాప్ సమీపంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను బిజెపి డివిజన్ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి బుధవారం మాజీ సర్పంచ్ ఏనుగు కావేరి మచ్చేందర్ రెడ్డి, మాజీ ఎంపిటిసి ఏనుగు లక్ష్మారెడ్డిలతో కలిసి ప్రారంభించారు. 

ఈసేవా కార్యక్రమాలను నిరంతరం ముందుండి నడిపిస్తున్న వైయస్ రెడ్డి ట్రస్ట్ వ్యవస్థాపకుడు, చైర్మన్ ఏనుగు సుదర్శన్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీధర్, సీనియర్ నాయకులు సత్యనారాయణ, పల్లె మధు, వెంకట్ రెడ్డి, కట్ట మధుసూదన్ రెడ్డి, ఏనుగు రఘురాంరెడ్డి, గుండె నరేష్, బాలుయాదవ్, కాసుల వెంకటేష్ గౌడ్, మహేష్, సాయిలు, గ్రామ ప్రజలు, ట్రస్ట్ సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.