27 July, 2026 | 2:24 AM

ఫ్లైఓవర్ పనులు పునః ప్రారంభించాలి

27-07-2026 12:26 AM

మేడ్చల్ అర్బన్, జూలై 26(విజయక్రాంతి): పట్టణంలోని ఎన్ హెచ్ 44 పై నిలి చిపోయిన ఫ్లైఓవర్ పనులను పునః ప్రారంభించాలని  మాజి కౌన్సిలర్ నడికొప్పు ఉ మా నాగరాజు ముదిరాజ్ మల్కాజిగిరి బిజెపి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్‌కు వినతి పత్రం అందజేశారు.ఈ సం దర్భంగా ఆమే మాట్లాడుతూ మేడ్చల్ జాతీ య రహదారిపై ప్రారంభమైన ఫ్లైఓవర్ పను లు అర్థాంతంగా నిలిచిపోవడంతో పట్టణ ప్ర జలకు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని స్పష్టం చేశారు.

ముక్యం గా  దెబ్బతిన్న రోడ్డు వలన అనేక మంది మృత్యువాత పడుతున్నారని ఆమే  పేర్కొన్నారు. మేడ్చల్ చెక్ పోస్ట్ నుండి అత్వెల్లి వ రకు జాతీయ రహదారి గుంతలమయమై ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా రోడ్డుని నూతనంగా నిర్మించాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఈటల రాజేందర్‌కు విజ్ఞప్తి చేశారు. ఫ్లైఓవర్ పనుల విషయంపై సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరి ష్కారానికి కృషి చేస్తానని ఎంపీ చెప్పినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు నాగరాజు, లాయక్ అలీ, బాలరాజ్, బాలమల్లేష్ యాదవ్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.