calender_icon.png 23 February, 2026 | 5:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎఫ్ఎల్ఎన్ సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలి

23-02-2026 01:34:27 PM

 జిల్లా విద్యాధికారి యాదయ్య

మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి):  మంచిర్యాల జిల్లాలో ఎంపిక చేసిన 53 పాఠశాలల్లో ఈ నెల 25, 26, 27 తేదీల్లో నిర్వహించబోయే ఎఫ్ ఎల్ ఎన్ సర్వేను విజయవంతంగా నిర్వహించాలని మంచిర్యాల జిల్లా విద్యాధికారి s. యాదయ్య తెలిపారు. సోమ వారం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఎస్ఆర్కెఎం (SRKM) డైట్ కాలేజీ విద్యార్థులకు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.

ఈ ఎఫ్ ఎల్ ఎన్ సర్వే ను సమర్ధవంతంగా నిర్వహించాలని, నియమనిబంధనలు, సమయపాలన తప్పనిసరిగా పాటించాలని, ఏ సందేహాలు ఉన్న ఈ శిక్షణ కార్యక్రమంలో నివృత్తి చేసుకోవాలని, తద్వారా సర్వే సమర్ధవంతంగా నిర్వహించవచ్చని తెలిపారు. అదేవిధంగా సర్వే నిర్వహించే సమయంలో ఏవైనా సందేహాలు ఉంటే రిసోర్స్ పర్సన్లు, క్వాలిటీ కోఆర్డినేటర్ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు నుంచి సహాయం పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణమూర్తి, రిసోర్స్ పర్సన్ లు బుచ్చన్న, వామన్ కుమార్, SRKM డీ ఎడ్ కాలేజ్ ఇంచార్జి ప్రిన్సిపాల్ సురేష్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.