calender_icon.png 23 February, 2026 | 5:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దత్తత తీసుకున్న గ్రామాలలో దంత వైద్య శిబిరాలు

23-02-2026 03:37:17 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): తెలంగాణ డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ (Telangana Dental Students Association) సిర్పూర్ కాగజ్‌నగర్, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని రాస్పల్లి, పెద్దబండ, ఎల్కపల్లి, బారెగూడ గ్రామాలను దత్తత తీసుకున్నారు. రాస్పల్లి గ్రామంలో డిజిటల్ డెంటల్ సర్వే నిర్వహించి, ప్రజల దంత సమస్యలను నమోదు చేసి, మౌఖిక ఆరోగ్యంపై అవగాహన కల్పించాము. త్వరలో డిజిటల్ డెంటల్ హెల్త్ కార్డులు జారీ చేయబడతాయి అని వారు తెలిపారు.

మారుమూల గ్రామాలను దత్తత తీసుకొని గ్రామాలలో సమస్యలతో బాధపడే వారి కోసం ఉచితంగా దంత వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి దంత సమస్యలతో బాధపడే వారి సమస్యలు తీర్చడం అభినందనీయమని గ్రామాల ప్రజలు తెలంగాణ డెంటల్ అసోసియేషన్ బృందాన్ని అభినందించారు.ఈ కార్యక్రమం ఇంజినీరింగ్ విద్యార్థులు, కోశలేంద్ర ఫౌండేషన్ సహకారంతో విజయవంతంగా జరిగిందని తెలిపారు.సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు,రాస్పల్లి సర్పంచ్,సుమన్, నితిన్ బృందానికి పౌండేషన్ బృందం కృతజ్ఞతలు తెలిపారు.