23-02-2026 04:39:32 PM
వాంకిడి,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార్ లో సోమవారం సంత్ గాడ్గే బాబా 149వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిం చారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పిం చారు.అనంతరం ఈ కార్యక్ర మంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నా బౌద్ద మతం గురు బంతే భరద్వాజ్, భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులు అశోక్ మహుల్కర్ లు మాట్లాడుతూ... గడిగే బాబా స్వచ్ఛత కు పెద్ద పీఠ ఇచ్చే వారని, స్వయంగా గ్రామ, గ్రామాలు తిరిగి వీధులను శుభ్రం చేయడంతో పాటు మనుషుల బూజు కూడా దులిపే వారని వారు పేర్కొన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అంటే గాడ్గే బాబా కు ఎనలేని ప్రేమని,అదేవిధంగా అంబేడ్కర్ కు కూడా గడిగే బాబా అంటే బాగా ఇష్టమని దీంతో ఇరువురు ఒకరి కార్యక్రమానికి హాజరు అయ్యేవారని తెలిపారు.బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రసంగం అంటే గడిగే బాబా ఎక్కడ ఉన్నా వినడానికి వచ్చేవారని,అదేవిధంగా గడిగే బాబా కీర్తనలు వినడానికి ఎక్కడ ఉన్నా అంబేద్కర్ శ్రద్ధగా వినే వారాని అన్నారు. దేశంలో అణగారిన రాజకులను ఎస్సీలో కలపాలని,వారి చదువు కోసం అహర్నిశలు కృషి చేశారు.
మహారాష్ట్రలో వారి కోసం ప్రత్యేక పాఠశాలలను, హాస్టల్ లను ఏర్పాటు చేశారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం కార్యదర్శి రోషన్ ఉప్రే, సమాజ్ పెద్ద శ్యామ్ రావు లహుజీ దుర్గే, ఈవెంట్స్ మేనేజర్ బల్వంత్ ఉప్రే,సిద్దార్థ యువజన సంఘం మాజి అధ్యక్షులు దుర్గం దీపక్,ఉపాసక్ రమేష్ డోంగ్రే,విఠల చునార్కర్,విద్య సాగర్,వివేక్, స్వాగత్, వేంకటి జాడే, ప్రశాంత్,జాడే,మనోజ్ దుర్గే, రెంటికీ బుద్దా జీ,తదితరులు పాల్గొన్నారు.