అయిదు గంటల్లో అయిదు సాధారణ కాన్పులు
అశ్వారావుపేట, మార్చి 11 (విజయక్రాంతి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట స్థానిక ఏరియా ఆసుపత్రి సిబ్బంది అయిదు గంటల్లో అయిదు సుఖ ప్రసవాలు చేసి రికార్డ్ నెలకొల్పారు. వీరిలో ముగ్గురు మగ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు . తల్లి బిడ్డ అందరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి 12 నుంచి బుధవారం తెల్ల వారు జామున 5 గంటలలోపు ఈ సాధారణ కాన్పులు జరిగాయని వైద్యులు తెలి పారు.
మెడికల్ సూపరడెంట్ డాక్టర్ రాధా రుక్మిణి మాట్లాడుతూ సాధారణ కాన్పులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామని, ఇక్కడ రోగులకు ప్రభుత్వ సేవల మీద నమ్మకం కలిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గతంలో సురక్షిత సుఖప్ర సవాలు కోసం 80 కిలో మీటర్ల దూరంలో ఉన్న కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి కి వ్యయ ప్రయాసలోర్చి గర్భిణి స్త్రీలు వారి కుటుంబ సభ్యులు వెళ్లేవారని, ఇప్పుడు కలెక్టర్, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ,
డి సి హెచ్ ఎస్ రవి బాబు సహాకారాలతో 24 గంటల ప్రసూతి వైద్యుల పర్యవేక్షణ, ఆపరేషన్ థియేటర్, మెటర్నిటీ వార్డులలో ఏసీ సౌకర్యం, ఇతర మౌలిక వసతులు,సౌకర్యాలు ఏర్పాటు అయ్యాయి అని తెలిపారు. అలాగే రోగులకు టిఫ స్కాన్ మరియు అన్ని రకాల రక్త పరోక్షలు సేవలు అందుబాటులో ఉన్నాయి అని అన్నారు . తద్వారా గర్భిణి మహిళలు స్థానిక ఆసుపత్రి లోను ప్రసవాలకు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం లో ప్రసూతి వైద్యురాలు డాక్టర్ మౌనిక, హెడ్ నర్సింగ్ ఆఫీసర్ ఆశ వర్దిని, నర్సింగ్ ఆఫీసర్ వీర కుమారి, Anm ఏ ఎన్ ఎం సుజాత, పి సి అనూష పాల్గొన్నారు.




