4 March, 2026 | 12:56 PM

లారీని ఢీకొట్టిన కారు: ఐదుగురు అక్కడిక్కడే మృతి

04-03-2026 11:20 AM

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో(Chittoor District) బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు కంటైనర్‌ లారీని వెనుక వైపు నుంచి ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందారు. గంగవరం మండలం వైఎస్ఆర్ జంక్షన్(YSR Junction) వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుండి తిరుపతి వెళుతుండగా వెనుక నుండి లారీని ఢీకొట్టింది.

కారు ఢీకొన్న కారణంగా కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే మరణించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన మోహన్ దాస్(71), నాగరాజారావు(61), కుసుమ(61), జయంతి(59), పూజ (33)గా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కంటైనర్ వెనక భాగంలో ఇరుక్కుపోయిన కారు దాదాపు 500 మీటర్ల వరకు లారీతో పాటు లాక్కెళ్ళినట్లు సీసీ ఫుటేజ్ లో కనిపిస్తోందని పోలీసులు చెప్పారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.