ప్రైవేట్ బస్సు బోల్తా: ఐదుగురు మృతి, 20 మందికి గాయాలు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని(Chhattisgarh) జాష్‌పూర్ జిల్లాలో శుక్రవారం ఒక ప్రైవేట్ బస్సు బోల్తా(Private bus overturns) పడటంతో ఐదుగురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పొరుగున ఉన్న జార్ఖండ్‌లోని కుర్దేగ్ నుండి బస్సు ఛత్తీస్‌గఢ్‌లోని కుంకురి పట్టణం వైపు వెళుతుండగా ఈ ప్రహదం చోటుచేసుకుందని జాష్‌పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లాల్ ఉమేద్ సింగ్ తెలిపారు.
తప్కరా పోలీస్ స్టేషన్(Tapkara Police Station) పరిధిలోని గోడాంబ గ్రామం సమీపంలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడని, దీంతో వాహనం బోల్తా పడిందని తెలిపారు. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా, మరో 20 మంది గాయపడ్డారని అధికారి తెలిపారు. సమాచారం అందుకున్న సీనియర్ పోలీసు అధికారులు, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.




